తెలంగాణ, మంచిర్యాల. 13 సెప్టెంబర్ (హి.స.)
మంచిర్యాల జిల్లా దమ్మన్నపేటలో
శనివారం ఉదయం నుంచీ ఉద్రిక్త పరిస్థితి పరిస్థితి నెలకొంది. అటవీప్రాంతాన్ని ఆక్రమించుకుని పోడు రైతులు గుడిసెలు వెసుకోగా.. అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. శుక్రవారం వారి గుడిసెలను తొలగించేందుకు వెళ్లిన అధికారులపై పోడురైతులు దాడి చేసి, కళ్లల్లో కారం చల్లారు. దాంతో శనివారం మూడు జేసీబీలతో 80 ఏకరాల్లో పంటమొత్తాన్ని ధ్వంసం చేశారు. అటవీశాఖకు చెందిన భూముల్లో గుడిసెలను వేసుకోవడం చట్టవిరుద్ధమని చెప్పేందుకు వెళ్లిన అధికారులపై పోడు రైతులు తిరగబడ్డారు. దీంతో పోలీసులు 16 మంది ఆదివాసీ మహిళల్ని అరెస్ట్ చేశారు.
సుమారు మూడు గంటలపాటు రైతులు, అటవీశాఖ అధికారుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోడు రైతులు పంట సాగుచేస్తోన్న 200 ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించారు. ఆరు జేసీబీలతో అక్కడి గుడిసెలను తొలగించారు. పోడు రైతులు అధికారులపై తిరగబడటంతో చేసేది లేక వారు వెనుదిరిగారు. అరెస్ట్ చేసిన ఆదివాసీ మహిళలను విడుదల చేయాలని పోలీసుల్ని డిమాండ్ చేయడంతో.. దమ్మన్నపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు