తెలంగాణ, మెదక్. 13 సెప్టెంబర్ (హి.స.)
మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం వద్ద వరద ప్రవాహం మరోసారి పెరిగింది. జిల్లాలో కురిసిన భారీ వర్షానికి మంజీరానదిలో వరద ఉధృతి పెరిగింది. గర్భగుడి ముందు నుంచి వరద ప్రవహిస్తున్నది. దీంతో ఆలయాన్ని మరోసారి అధికారులు మూసివేశారు. ఇటీవలే కురిసిన వర్షాలకు దాదాపు నెల రోజులుగా మూతపడిన ఈ ఆలయం మూడ్రోజుల క్రితమే అమ్మవారి మూలవిరాట్ దర్శనాలు పునః ప్రారంభమయ్యాయి. ఇంతలోనే మరోసారి వరద పెరగడంతో ఆలయాన్ని మూసివేయాల్సి వచ్చింది. శనివారం తెల్లవారుజామున అర్చకులు అమ్మవారికి అభిషేకం చేపట్టి సహస్రనామార్చన, కుంకుమార్చన అనంతరం ఆలయాన్ని మూసివేశారు. దుర్గామాతకు రాజగోపురంలో పూజలు నిర్వహిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు