అమరావతి, 13 సెప్టెంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ లేఖ రాశారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆరోపణలు చేయడం తగదని సూచించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై దుష్ప్రచారం ఆపాలని కోరారు. 17 మెడికల్ కాలేజీలు తెచ్చామని వైసీపీ అబద్దాలు చెప్తుంది.. రూ. 8480 కోట్లతో 17 మెడికల్ కాలేజీలు ప్రతిపాదించి కేవలం రూ. 1, 451 కోట్లకే బిల్లులు చెల్లించారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ హాయంలో నిర్మించిన మెడికల్ కాలేజీల్లోనూ అడ్మిషన్లు తీసుకు రాలేకపోయారని విమర్శలు గుప్పించారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం వచ్చాకే మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లపై దృష్టి పెట్టామని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ