'ఆ గాయం జీవితాంతం వెంటాడుతుంది'.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, 13 సెప్టెంబర్ (హి.స.) హైదరాబాద్ లోని హోటల్ పార్క్ హయత్ ప్రాంగణంలో సీఐఐ, యంగ్ ఇండియన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాసూమ్ సమ్మిట్ 10వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై, చిన
మంత్రి సీతక్క


హైదరాబాద్, 13 సెప్టెంబర్ (హి.స.)

హైదరాబాద్ లోని హోటల్ పార్క్ హయత్ ప్రాంగణంలో సీఐఐ, యంగ్ ఇండియన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాసూమ్ సమ్మిట్ 10వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై, చిన్నారుల భద్రత, మహిళల రక్షణ, పోషకాహారం, మహిళా సాధికారత వంటి కీలక అంశాలపై ప్రసంగించారు. చిన్నారుల రక్షణను తమ ప్రజా ప్రభుత్వం ప్రధాన బాధ్యతగా భావిస్తోందని స్పష్టం చేశారు. పిల్లలు అంటే మన భవిష్యత్తు. వారి రక్షణ అంటే మన భవిష్యత్తు రక్షణ. పసి హృదయాల్లో నాటుకుపోయే భావనలే వారి జీవితాన్ని నిర్దేశిస్తాయి. చిన్నారి గాయపడితే ఆ గాయం జీవితాంతం వెంటాడుతుంది. అందుకే నిర్భయంగా, స్వేచ్ఛగా, ధైర్యంగా పిల్లలు జీవించే వాతావరణాన్ని కల్పించడం సమాజం మొత్తం బాధ్యత” అని ఆమె అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande