వదిలిపెట్టం.. సాధించి తీరుతాం: మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
హైదరాబాద్, 13 సెప్టెంబర్ (హి.స.) కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు రావాల్సిన నీటివాటలో ఒక్క చుక్క నీరు కుడా వదులుకునే ప్రసక్తేలేదని ఆయన తేల్చ
మంత్రి ఉత్తమ్


హైదరాబాద్, 13 సెప్టెంబర్ (హి.స.)

కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు రావాల్సిన నీటివాటలో ఒక్క చుక్క నీరు కుడా వదులుకునే ప్రసక్తేలేదని ఆయన తేల్చిచెప్పారు. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు దేశరాజధాని ఢిల్లీలో జరగనున్న కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణలో తాను స్వయంగా పాల్గొనబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఢిల్లీలో 23 నుండి 25 వరకు జరగనున్న కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్-2 విచారణలో తెలంగాణ ప్రభుత్వం అనుసరించాల్సిన అంశంపై శనివారం ఆయన కార్యాలయంలో న్యాయనిపుణులు, నీటిపారుదల రంగ నిపుణులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... ఇదే అంశంపై ఒత్తిడి తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని ఢిల్లీకి చేరుకుని సమీక్షిస్తారని ఆయన వెల్లడించారు. కృష్ణా జలాశయాలలో తెలంగాణ వాటాను సాధించేందుకు బలమైన వాదనలు వినిపించేందుకు పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేశామని వారు ఇచ్చే నివేదికల ఆధారంగా న్యాయవాదులు రాష్ట్రానికి చెందాల్సిన నీటివాటపై వాదనలు వినిపించనున్నారని ఆయన పేర్కొన్నారు. KWDT ఎదుట 2025 ఫిబ్రవరి నుండి వాదనలు కొనసాగుతున్నాయని, సమైక్యాంధ్రలో తెలంగాణా ప్రాంతానికి జరిగిన అన్యాయంపై ప్రస్తావించారని ఆయన తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande