అవసరమైతే ఎక్సైజ్ శాఖకు ఆయుధాలను ఇస్తాం: జూపల్లి కృష్ణారావు.
హైదరాబాద్, 13 సెప్టెంబర్ (హి.స.) గంజాయి, డ్రగ్స్, నాటుసారా, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వినియోగంపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్లు ఉక్కుపాదం మోపాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. ప్రజల ప్రాణాల రక్షించే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని అన
Jupally


హైదరాబాద్, 13 సెప్టెంబర్ (హి.స.)

గంజాయి, డ్రగ్స్, నాటుసారా, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వినియోగంపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్లు ఉక్కుపాదం మోపాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. ప్రజల ప్రాణాల రక్షించే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని అన్నారు. ఎక్సైజ్ శాఖ భవన్లో అధికారులతో జూపల్లి కృష్ణారావు శనివారం నాడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఎస్టీఎఫ్ టీమ్లు, మంచిగా పని చేసేవారికి అవసరమైతే ఆయుధాలను కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని వెల్లడించారు. ఈ మేరకు మంచిగా పని చేసే వారిని గుర్తించి వారికి శిక్షణ ఇవ్వాలని మంత్రి అదేశించారు.

నల్ల బెల్లం తయారీ, అమ్మకాలు, వినియోగంపై పూర్తి స్థాయిలో అధ్యాయనం చేయాలని జూపల్లి కృష్ణారావు సూచించారు. ఎక్సైజ్శాఖ పట్టుకున్న నల్ల బెల్లాన్ని రైతులకు సేంద్రియ ఎరువుల తయారీకి ఇవ్వడానికి అవసరమైన మార్గ దర్శకాలను రూపొందించాలని ఆదేశించారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను పట్టుకున్నప్పుడు వాటిని పగులగొట్టకుండా, వినియోగించుకోవడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. వాటిని జాతీయ ఉత్పత్తిగా గుర్తించి అమ్మకాలు చేపట్టడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande