కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయం కోసం పోలీసులపై ఒత్తిడి తెస్తోంది.. ధర్మపురి అరవింద్
నిజామాబాద్, 13 సెప్టెంబర్ (హి.స.) కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయం కోసం పోలీసులపై ఒత్తిడి తెస్తోందని గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ఒకే రకంగా ప్రవర్తిస్తున్నాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. హిందువులన్నా, హిందూ పండగలన్నా చులకన భావంత
అరవింద్


నిజామాబాద్, 13 సెప్టెంబర్ (హి.స.)

కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయం కోసం పోలీసులపై ఒత్తిడి తెస్తోందని గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ఒకే రకంగా ప్రవర్తిస్తున్నాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. హిందువులన్నా, హిందూ పండగలన్నా చులకన భావంతో చూస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ నిజామాబాద్ కమిషనరేట్ లో సీపీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇటీవల నవీపేటలో ఓ యువకుడు గణపతిపై కాషాయ జెండా ఎగురవేస్తే ఫోటోలో అది మసీదుపై పెట్టినట్లు వచ్చిందని దాంతో ఆ యువకుడిని ఆగమేఘాల మీద అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారన్నారు. ఈ ఘటన తర్వాత అక్కడ ముస్లింలు బైక్ ర్యాలీ నిర్వహించి రబసా చేసినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేని మేము డిమాండ్ చేశాక చర్యలు తీసుకున్నారని చెప్పారు. జెండా ఎగురవేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడు రాజస్థాన్ కు చెందిన వాడని అతడిని రాజస్థాన్ పంపాలని అంటున్నారు. మరి దేశంలోకి వచ్చిన బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి ఎందరో అక్రమంగా ప్రవేశించారు. టర్కీ నుంచి వచ్చి తరతరాలుగా ఇక్కడే ఉంటున్న కూడా వెనక్కి పంపిద్దామా కాంగ్రెస్ చెప్పాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande