హైదరాబాద్ కూకట్పల్లి జరిగిన రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు చేధించారు
అమరావతి, 13 సెప్టెంబర్ (హి.స.) హైదరాబాద్‌: కూకట్‌పల్లిలోని స్వాన్‌ లేక్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో జరిగిన రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు పురోగతి సాధించారు. నిందితులను ఝార్ఖండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను హైదరాబాద్‌కు తరలిస్తున్నారూ ర
హైదరాబాద్ కూకట్పల్లి జరిగిన రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు చేధించారు


అమరావతి, 13 సెప్టెంబర్ (హి.స.)

హైదరాబాద్‌: కూకట్‌పల్లిలోని స్వాన్‌ లేక్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో జరిగిన రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు పురోగతి సాధించారు. నిందితులను ఝార్ఖండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను హైదరాబాద్‌కు తరలిస్తున్నారూ

రాకేశ్‌ అగర్వాల్, రేణు అగర్వాల్‌(50) దంపతులకు ఫతేనగర్‌లో స్టీలు దుకాణం ఉంది. కుమార్తె తమన్నా ఇతర రాష్ట్రాల్లో చదువుతుండగా.. కుమారుడు శుభంతో కలిసి తల్లిదండ్రులు నివసిస్తున్నారు. స్వాన్‌ లేక్‌లోనే ఉండే రేణు బంధువుల ఇంట్లో ఝార్ఖండ్‌కు చెందిన రోషన్‌ తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్నాడు. అతడు ఝార్ఖండ్‌లోని తన గ్రామానికే చెందిన హర్ష్‌ను కొన్ని రోజుల క్రితం రేణు ఇంట్లో వంట మనిషిగా పనికి కుదిర్చాడు. బుధవారం ఉదయం రాకేశ్, శుభం దుకాణానికి వెళ్లగా... ఇంట్లో రేణు ఒక్కరే ఉన్నారు. సాయంత్రం ఐదింటికి భర్త, కుమారుడు ఫోన్‌ చేసినా ఆమె స్పందించలేదు. 7 గంటల సమయంలో రాకేశ్‌ ఇంటికొచ్చి తలుపు తట్టినా తీయకపోవడంతో ప్లంబర్‌ను పిలిపించి.. వెనుక వైపు నుంచి లోపలికి పంపించి... తలుపు తీయించారు. ఇంట్లోకి వెళ్లిచూడగా... హాల్లో రేణు కాళ్లు, చేతులు కట్టేసి ఉన్న స్థితిలో రక్తపు మడుగులో పడి ఉన్నారు. తల, ఇతర శరీర భాగాలపై తీవ్ర గాయాలున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేయగా... హర్ష్, రోషన్‌లు ఈ దారుణానికి పాల్పడినట్లు వారు నిర్ధారించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande