తెలంగాణ, సిద్దిపేట. 13 సెప్టెంబర్ (హి.స.)
గ్రూప్ వన్ పరీక్ష అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేటలో శనివారం మెగా జాబ్ మేళా కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తప్పును సరిదిద్దు కోకుండా గ్రూప్ వన్లో ఉద్యోగానికి మంత్రులు, అధికారులు లక్షల రూపాయలు నిరుద్యోగుల వద్ద లంచం అడిగారని వార్తలొస్తున్నాయి అన్నారు. గ్రూప్ వన్ పై మరోసారి అప్పీల్కి వెళ్లాలని ప్రభుత్వం భావించడం సిగ్గుచేటు అన్నారు. రాహుల్ గాంధీని అశోక్ నగర్ లో కూర్చోబెట్టి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేశాడని మండిపడ్డారు. నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తాం.. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం.. మీకు న్యాయం జరిగే వరకూ కృషి చేస్తా అని హరీష్ రావు స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు