దొరకని యూరియా.. ఇబ్బంది పడుతున్న రైతులు..
తెలంగాణ, నాగర్ కర్నూల్. 13 సెప్టెంబర్ (హి.స.) అమ్రాబాద్ మండల కేంద్రంలోని రైతు ఉత్పత్తి కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. మూడు నాలుగు నెలల నుండి పడిగాపులు కాస్తున్న సరిపడా యూరియా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 6 గంటల నుంచి క్
యూరియా


తెలంగాణ, నాగర్ కర్నూల్. 13 సెప్టెంబర్ (హి.స.)

అమ్రాబాద్ మండల కేంద్రంలోని రైతు

ఉత్పత్తి కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. మూడు నాలుగు నెలల నుండి పడిగాపులు కాస్తున్న సరిపడా యూరియా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 6 గంటల నుంచి క్యూ లైన్లో నిలబడినా యూరియా దొరకడం లేదని వాపోతున్నారు.

టోకెన్లు ఇచ్చినా.. యూరియా ఇవ్వరని ఆగ్రహం.. వారం రోజులుగా యూరియా కోసం తిరుగుతున్న యూరియా దొరకడం లేదని శనివారం రైతులు పెద్ద ఎత్తున కేంద్రం వద్దకు చేరుకున్నారు. రెండు రోజుల క్రితం యూరియా కోసం టోకెన్ ఇచ్చారు. కానీ యూరియా మాత్రం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులకు దొరుకుతున్న యూరియా రైతులకు ఎందుకు దొరకడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఒక్కో సంచి 300 ఉంటే 25 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పొద్దున్నే వచ్చి క్యూలో నిలబడినా టోకెన్లు తీసుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్న అందరికీ సరిపడా యూరియా లభించడం లేదని ఆ విధంగా వ్యక్తం చేస్తున్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande