మిలాద్ ఉన్ నబీ వేడుకలు శాంతియుతంగా జరుపుకుందాం: డీసీపీ చైతన్యకుమార్
హైదరాబాద్, 13 సెప్టెంబర్ (హి.స.) మిలాద్ ఉన్ నబీ వేడుకలను శాంతియుతంగా, సాంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ ఎస్. చైతన్యకుమార్ సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంల
హైదరాబాద్ డిసిపి


హైదరాబాద్, 13 సెప్టెంబర్ (హి.స.)

మిలాద్ ఉన్ నబీ వేడుకలను

శాంతియుతంగా, సాంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ ఎస్. చైతన్యకుమార్ సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముస్లిం మత పెద్దలు, మత నాయకులు, ఇమామ్లు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో డీసీపీ మాట్లాడుతూ.. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నగరమంతా శాంతి, భద్రతా ఏర్పాట్లు ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా ఊరేగింపులు, ప్రార్థనలు, మతపరమైన కార్యక్రమాలు ఎటువంటి అంతరాయం లేకుండా జరగడానికి పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

మత పెద్దలు, స్థానిక కమిటీ సభ్యులు కూడా పోలీసులకు సహకరించాలని డీసీపీ కోరారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా, వివాదాస్పద ప్రసంగాలు చేయకుండా వేడుకలు జరుపుకోవాలని సూచించారు. సమావేశంలో పాల్గొన్న మత పెద్దలు పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ అధికారులు, క్రైమ్ విభాగ అధికారులు, స్థానిక పోలీసులు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande