సిబిఐ విచారణ తప్పించుకోవడానికే మోడీతో బీఆర్ఎస్ కాళ్ల బేరం: మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, 13 సెప్టెంబర్ (హి.స.) కాళేశ్వరం విషయంలో సీబీఐ విచారణ తప్పించుకోవడానికే మోడీ కాళ్లకు మడుగులు ఒత్తుతూ బీఆర్ఎస్ ఉప రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో కేటీఆర్ తన స్థాయి మ
మహేష్ కుమార్ గౌడ్


హైదరాబాద్, 13 సెప్టెంబర్ (హి.స.)

కాళేశ్వరం విషయంలో సీబీఐ విచారణ తప్పించుకోవడానికే మోడీ కాళ్లకు మడుగులు ఒత్తుతూ బీఆర్ఎస్ ఉప రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో కేటీఆర్ తన స్థాయి మరిచి రాహుల్ గాంధీపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ మీ స్థాయి ఏంది? మీ కుటుంబ స్థాయి ఏంది అని ప్రశ్నించారు. రాష్ట్ర సంపదనంతా కొల్లగొట్టిన మీ కుటుంబం ఎక్కడా? దేశం కోసం సర్వ సంపదను త్యాగం చేసిన గాంధీ కుటుంబం ఎక్కడా అని నిలదీశారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ ఎందుకు ఓటు వేయలేదని ప్రశ్నించారు. నిఖార్సైన తెలంగాణవాది జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉంటే సిగ్గులేకుండా ఎన్నికకే దూరం ఉన్నారంటే బీజేపీతో లోపాయికారి ఒప్పదం ఏ మేరకు ఉందో అర్థమవుతోందన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఇప్పటికే కవిత చెప్పారని ముందు కవిత మాటలపై కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande