అమరావతి, 13 సెప్టెంబర్ (హి.స.)వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా (RK Roja) మరోసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై ఫైర్ అయ్యారు. ఇవాళ నగరి (Nagari)లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు పవన్ కళ్యాణ్‌కు ఓట్లేసింది సినిమా షూటింగ్స్ చేసుకోవడానికా అని ప్రశ్నించారు. ప్రభుత్వ స్పెషల్ ఫ్లైట్లలో చక్కర్లు కొట్టడానికి జనం ఆయనకు అధికారం ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో అన్నదాతలు యూరియా (Urea) అందక అష్టకష్టాలు పడుతున్నారని ఫైర్ అయ్యారు. కనీసం వారిని పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వంలో భాగస్వామని ఉన్నప్పుడు పవన్.. ప్రజా సమస్యలపై సీఎం చంద్రబాబు (CM Chandrababu)ను నియదీయాల్సిందేనని అన్నారు. కానీ, చంద్రబాబు కొనిచ్చిన హెలికాప్టర్‌లో పవన్ షికార్లు కొడుతున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తుంటే కనీసం పవన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కానీ, ప్రజలంతా ఇప్పుడు పవన్‌కు ఎందుకు ఓట్లు వేశాంరా బాబు.. అంటూ బాధపడుతున్నారని ఆర్కే రోజా కామెంట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి