శ్రీశైలం , 13 సెప్టెంబర్ (హి.స.)ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతున్నందున ఈ ఏడాది ఐదవసారి మూడు రేడియల్ క్రెస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తారు. ప్రస్తుతం జలాశయానికి ఇన్ ఫ్లో 2,26,192 క్యూసెక్కులుగా, ఔట్ ఫ్లో 1,49, 104 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 883.90 అడుగులకు చేరింది. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. అయితే.. ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ ఫ్లోలు పెరుగుతున్నాయని, అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీ(Andhra Pradesh)లో నేడు(శనివారం), రేపు(ఆదివారం) భారీ వర్షాలు(Heavy rains) కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి