తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. క్రిష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ క్యూ లైన్
తిరుమల,13 సెప్టెంబర్ (హి.స.)తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం.. పైగా రెండో శనివారం కావడంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ఈ రోజు శనివారం ఉదయానికి కంపార్టుమెంట్లన్నీ నిండి బయట క్యూలైన్లో కృష్ణత
తిరుమల


తిరుమల,13 సెప్టెంబర్ (హి.స.)తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం.. పైగా రెండో శనివారం కావడంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు.

ఈ రోజు శనివారం ఉదయానికి కంపార్టుమెంట్లన్నీ నిండి బయట క్యూలైన్లో కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ భక్తులు వేచి ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనానికి 12-15 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. అలాగే టోకెన్లు ఉన్న భక్తులకు 4-5 గంటల్లో శ్రీ వెంకటేశ్వర వారి దర్శనం కలుగుతుందని తెలిపింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 3-4 గంటల సమయం పడుతుందని పేర్కొంది.

ఇక నిన్న (శుక్రవారం) 69,842 మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర వారిని దర్శించుకున్నారు. వారిలో 28,234 మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం శ్రీ వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.4.18 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande