గడిచిన దశాబ్దం భారతీయ భాషలు, సంస్కృతి పునరుజ్జీవన స్వర్ణయుగం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ఢిలీ, 14 సెప్టెంబర్ (హి.స.)ఈ రోజు హిందీ దివస్ (Hindi Day) సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) దేశ ప్రజలకు కీలక సందేశంతో పాటు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోను విడుదల చేశారు అందులో అమిత్ షా మాట్లాడుతూ..
అమిత్ షా


ఢిలీ, 14 సెప్టెంబర్ (హి.స.)ఈ రోజు హిందీ దివస్ (Hindi Day) సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) దేశ ప్రజలకు కీలక సందేశంతో పాటు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోను విడుదల చేశారు అందులో అమిత్ షా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత దశాబ్దం భారతీయ భాషలు, సంస్కృతి పునరుజ్జీవనం పొందిన స్వర్ణయుగమని అన్నారు. అలాగే “ప్రధాని మోడీ (Prime Minister Modi) UN, G20, SCO వంటి అంతర్జాతీయ వేదికలపై హిందీతో పాటు భారతీయ భాషల్లో మాట్లాడి దేశ గౌరవాన్ని పెంచారు. ఆజాదీ కా అమృత్ కాల్‌లో వలసవాద చిహ్నాల నుండి దేశాన్ని విడిపించడానికి ప్రధాని ‘పంచ్ ప్రాణ్’ను ప్రవేశపెట్టారు. భాషలు అందులో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఈ సందర్భంగా షా చెప్పుకొచ్చారు. అలాగే “భారతదేశం ప్రాథమికంగా భాషా ఆధిపత్య దేశం.

మన భాషలు చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, జ్ఞానం, సైన్స్, తత్వశాస్త్రం, ఆధ్యాత్మికతను తరతరాలకు అందిస్తున్నాయి. భాషలు మనకు ఐక్యతను, అభివృద్ధిని అందించే శక్తి కలిగివున్నాయి” స్వాతంత్ర్య ఉద్యమంలో “హిందీతో పాటు అన్ని భారతీయ భాషల కవులు, రచయితలు, నాటకకర్తలు జానపద కథలు, పాటలు, నాటకాల ద్వారా స్వేచ్ఛా భావాన్ని బలపరిచారు. ‘వందేమాతరం’, ‘జై హింద్’ వంటి నినాదాలు భాషా మేల్కొలుపు నుండి పుట్టాయని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అలాగే 1949 “సెప్టెంబర్ 14న దేవనాగరి లిపిలో వ్రాయబడిన హిందీని అధికారిక భాషగా ప్రకటించారని. ఈ రోజు మనకు భాషల ఏకత, భారతీయ సంస్కృతిని గుర్తుచేస్తుందని ఈ సందర్భంగా అమిత్ షా తన సందేశంలో చెప్పుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande