నా మేధస్సు.. విలువ నెలకు రూ.200 కోట్లు.. నితిన్‌ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ,14,సెప్టెంబర్ (హి.స.) 20 శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ సురక్షితం కాదంటూ ఇటీవల పెద్దఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీని ద్వారా తాను వ్యక్తిగతంగా లబ్ధిపొందానంటూ వస్తోన్న విమర్శలపై కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nit
Nitin Gadkari


న్యూఢిల్లీ,14,సెప్టెంబర్ (హి.స.) 20 శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ సురక్షితం కాదంటూ ఇటీవల పెద్దఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీని ద్వారా తాను వ్యక్తిగతంగా లబ్ధిపొందానంటూ వస్తోన్న విమర్శలపై కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) స్పందించారు. ఈ సందర్భంగా తన మేధస్సు.. విలువ నెలకు రూ.200 కోట్లని, డబ్బుకు ఎలాంటి లోటు లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

శనివారం నాగ్‌పుర్‌లో అగ్రికోస్ వెల్ఫేర్ సొసైట్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఆలోచనలు రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు తప్ప.. జేబులు నింపుకొనేందుకు కాదన్నారు. ‘నేను డబ్బు కోసం ఇలా చేస్తున్నానని మీరు అనుకుంటున్నారా?.. నిజాయతీతో ఎలా సంపాదించాలో నాకు తెలుసు. నాకూ ఓ కుటుంబం, ఇల్లు ఉంది. నేను సాధువును కాదు.. రాజకీయ నాయకుడిని. రైతుల శ్రేయస్సు కోసం మా ప్రయత్నాలు కొనసాగుతాయి’ అని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande