రాష్ట్ర గవర్నర్ బీజేపీకి చప్రాసీనా..? CPI నారాయణ కామెంట్స్
న్యూఢిల్లీ, 15 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ గవర్నర్ బీజేపీకి చప్రాసీల వ్యహరిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సెప్టెంబర్ 17న బీజేపీ సర్కార్ తెలంగాణ విమోచన దినోత్సవాన్
సిపిఐ నారాయణ


న్యూఢిల్లీ, 15 సెప్టెంబర్ (హి.స.)

తెలంగాణ గవర్నర్ బీజేపీకి చప్రాసీల

వ్యహరిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సెప్టెంబర్ 17న బీజేపీ సర్కార్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17 గురించి తెలంగాణ ప్రజలకు బీజేపీ నేతలు వక్ర భాష్యం చెబుతున్నారని మండిపడ్డారు. నాడు తెలంగాణ సాయుధ పోరాటంలో రాజాకార్లకు వ్యతిరేకంగా ప్రాణాలకు ఎదురొడ్డి పోరాడింది కేవలం కమ్యూనిస్టులు మాత్రమేనని అన్నారు.

రాష్ట్ర బీజేపీ నేతలు ఏది చెబితే రాష్ట్ర గవర్నర్ అందుకు తలాడిస్తున్నాడని నారాయణ కామెంట్ చేశారు. ప్రతి ఏటా సెప్టెంబర్ 17 రాగానే హడావుడి చేయడం వారికి పరిపాటిగా మారిందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande