విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలి.. కల్వకుర్తి ఎమ్మెల్యే
తెలంగాణ, నాగర్ కర్నూల్. 15 సెప్టెంబర్ (హి.స.) రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ మౌలిక వసతుల కల్పనకు విరివిగా నిధులను ఖర్చు చేస్తున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం మాడ్గుల మండలం నాగిళ్ల గ
కల్వకుర్తి ఎమ్మెల్యే


తెలంగాణ, నాగర్ కర్నూల్. 15 సెప్టెంబర్ (హి.స.)

రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి

అధిక ప్రాధాన్యతనిస్తూ మౌలిక వసతుల కల్పనకు విరివిగా నిధులను ఖర్చు చేస్తున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం మాడ్గుల మండలం నాగిళ్ల గ్రామంలోని ఎస్సీ కాలనీలో 10 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా వినడంతోపాటు లక్ష్యాన్ని ఎంచుకొని విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande