బెంగుళూరుకు చెందిన టేవోల్ట్ సంస్థ ఎలెక్ట్రిక్ వాహనాన్ని టిటిడి కి.విరాళం
తిరుమల, 15 సెప్టెంబర్ (హి.స.) : బెంగళూరుకు చెందిన టివోల్ట్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ సంస్థ తితిదేకు ఓ వాహనాన్ని విరాళంగా అందించింది. రూ.15,94,962 విలువైన మొంట్రా ఎలక్ట్రిక్‌ ఏవియేటర్‌ వాహనాన్ని ఆ సంస్థ ప్రతినిధులు అందజేశారు. శ్రీవారి ఆలయం ముందు వాహనాన
బెంగుళూరుకు చెందిన టేవోల్ట్  సంస్థ ఎలెక్ట్రిక్ వాహనాన్ని టిటిడి కి.విరాళం


తిరుమల, 15 సెప్టెంబర్ (హి.స.)

: బెంగళూరుకు చెందిన టివోల్ట్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ సంస్థ తితిదేకు ఓ వాహనాన్ని విరాళంగా అందించింది. రూ.15,94,962 విలువైన మొంట్రా ఎలక్ట్రిక్‌ ఏవియేటర్‌ వాహనాన్ని ఆ సంస్థ ప్రతినిధులు అందజేశారు. శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తాళాలను తితిదే డిప్యూటీ ఈవో లోకనాథానికి అందించారు. ఈ కార్యక్రమంలో తితిదే బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande