అమరావతి, 15 సెప్టెంబర్ (హి.స.) తగ్గించే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు)శుభవార్త తెలిపారు. ప్రస్తుతం వాడుతున్న యూరియాను తగ్గిస్తే ప్రతి బస్తాకు రూ.800 నేరుగా రైతుకు అందిస్తామని హామీ ఇచ్చారు. అంటే.. ఒక రైతు తన పంటకు ఈ ఏడాది నాలుగు బస్తాల యూరియా వినియోగించి, వచ్చే ఏడాది రెండు బస్తాలు మాత్రమే వాడితే ప్రతి బస్తాకు రూ.800 చొప్పున రూ.1600 వారి ఖాతాల్లో జమ చేస్తారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ