శ్రీశైలం,15 సెప్టెంబర్ (హి.స.)అష్టదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఈ రోజు క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి.
మల్లన్న దర్శనం కోసం గంటల తరబడి భక్తులు నిలబడ్డారు. రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసి పోయాయి.
శ్రీశైలంకు చేరుకున్న వారు ముందుగా పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించారు. మొక్కులు తీర్చుకొని తలనీలాలు సమర్పించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఈవో శ్రీనివాస రావు అన్ని ఏర్పాట్లు చేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి