యూరియా పంపిణీలోనూ రాజకీయం.. పీఎసీఎస్ కార్యాలయం వద్ద రచ్చ.. రచ్చ
విజయనగరం, 15 సెప్టెంబర్ (హి.స.)యూరియా(Urea) కొరత ఓ వైపు అల్లడిపోతుంటే మరోవైపు రాజకీయ నాయకులు సిఫార్సులు కొట్లాటకు గురవుతున్నాయి. యూరియా కావాలంటూ రైతులు పొద్దున నుంచి పీఎసీఎస్ కార్యాలయాల వద్ద పడి గాపులు కాస్తున్నారు. అయితే కొందరు రైతులు మాత్రం రాజకీయ
యూరియా పంపిణీలోనూ రాజకీయం.. పీఎసీఎస్ కార్యాలయం వద్ద రచ్చ.. రచ్చ


విజయనగరం, 15 సెప్టెంబర్ (హి.స.)యూరియా(Urea) కొరత ఓ వైపు అల్లడిపోతుంటే మరోవైపు రాజకీయ నాయకులు సిఫార్సులు కొట్లాటకు గురవుతున్నాయి. యూరియా కావాలంటూ రైతులు పొద్దున నుంచి పీఎసీఎస్ కార్యాలయాల వద్ద పడి గాపులు కాస్తున్నారు. అయితే కొందరు రైతులు మాత్రం రాజకీయ నాయకుల సిఫార్సులు ఈజీగా యూరియా తీసుకువెళ్తున్నారు. దీంతో రైతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పొద్దున్నుంచి ఉన్న తమకు ఇవ్వకుండా సిఫార్సులతో వచ్చిన వాళ్లకు యూరియా ఇవ్వడంపై క్యూ లైన్లలో ఉన్న రైతులు మండిపడుతున్నారు. అధికారులను ప్రశ్నిస్తున్నారు. సిఫార్సుతో వచ్చిన రైతులకు యూరియా ఇవ్వనీయకుండా అడ్డుకుంటున్నారు. దీంతో పీఎసీఎస్ కార్యాలయాల కార్యాలయాల వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఆగ్రహంతో కార్యాలయాల కుర్చీలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande