టమాటా ధర భారీగా పతనం.. పత్తికొండ మార్కెట్‌లో కిలో రూ.2
పత్తికొండ , 15 సెప్టెంబర్ (హి.స.)రెక్కలు ముక్కలు చేసుకుని, రూ.లక్షలు వెచ్చించి సాగు చేసిన టమాటా (Tomato) ధర చూస్తుండగానే భారీగా పతనమైంది. తెగుళ్ల బెడదను తట్టుకుని ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చినప్పటికీ అన్నదాత కళ్లల్లో ఆనందం లేకుండా పోయింది. తాజాగా,
టమాటా


పత్తికొండ , 15 సెప్టెంబర్ (హి.స.)రెక్కలు ముక్కలు చేసుకుని, రూ.లక్షలు వెచ్చించి సాగు చేసిన టమాటా (Tomato) ధర చూస్తుండగానే భారీగా పతనమైంది. తెగుళ్ల బెడదను తట్టుకుని ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చినప్పటికీ అన్నదాత కళ్లల్లో ఆనందం లేకుండా పోయింది. తాజాగా, మదనపల్లి (Madanapally) మార్కెట్‌లో టమాటా ధర పూర్తిగా పడిపోయింది. కిలో టమాటా కేవలం రూ.5లు మాత్రమే పలుకుతోంది. ఈ పరిణామంతో రాష్ట్ర వ్యాప్తంగా టమటా రైతులు లబోదిబోమంటున్నారు. అదేవిధంగా కర్నూలు జిల్లా పత్తికొండ (Pattikonda) మార్కెట్‌లో టమాటా ధర కిలో రూ.2 కూడా పలకడం లేదు. దీంతో తమకు రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఏకరువు పెడుతున్నారు. రెండు రోజుల క్రితం నంద్యాలలోని ప్యాపిలి (Pyapili) మార్కెట్లో సైతం టమాటా ధర భారీగా పతనమైంది. ఈ మార్కెట్‌లో కిలో టమాటా ఫస్ట్ గ్రేడ్ రూ.10, మీడియం గ్రేడ్ టమాటా రూ.3 పలికింది. వ్యయ ప్రయాసలకు ఓర్చి తాము పండించిన పంటతో అప్పులపాలు అయ్యామని.. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని విజ్క్షప్తి చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande