విద్యార్థులు చదువుతోపాటు కళలలో కూడా రాణించాలి: భద్రాద్రి జిల్లా కలెక్టర్
తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 17 సెప్టెంబర్ (హి.స.) విద్యార్థులు చదువుతోపాటు కళలలో కూడా రాణించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో బుధవారం రెండు రోజుల పాటు జరగనున్న జిల
భద్రాద్రి కలెక్టర్


తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 17 సెప్టెంబర్ (హి.స.)

విద్యార్థులు చదువుతోపాటు కళలలో

కూడా రాణించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో బుధవారం రెండు రోజుల పాటు జరగనున్న జిల్లా స్థాయి కళా ఉత్సవం పోటీలను ప్రారంభించిన ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ చిన్నతనంలో తనకు కూడా కళల పట్ల ఆసక్తి ఉండేదని, సంగీత ఉపాధ్యాయురాలు అంటే తనకు ఎంతో ఇష్టమని, కానీ వాటిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేక పోయానని, కానీ నేటి విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుంటేనే భవిష్యత్తు ఆకర్షణీయంగా ఉంటుందని సూచించారు. పిల్లలందరూ తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకోవడానికి దారి చూపించే ఒక మార్గమే ఇటువంటి పోటీలను పిల్లలకు ఉద్బోధించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande