ఏపీ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. కొనసాగుతోన్న ప్రశ్నోత్తరాలు
అమరావతి, 18 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Speaker Ayyanna Pathrudu) ప్రశ్నోత్తరాలతో సభను ప్రారంభించారు. సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం సభలో మొత్తం 8 సవరణ బిల్లులను ప్రవేశపె
ap-monsoon-assembly-sessions-begin-qa-ongoing-476091


అమరావతి, 18 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Speaker Ayyanna Pathrudu) ప్రశ్నోత్తరాలతో సభను ప్రారంభించారు. సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం సభలో మొత్తం 8 సవరణ బిల్లులను ప్రవేశపెట్టనుంది. వాటిలో పంచాయతీరాజ్‌ సవరణ, మున్సిపల్‌ చట్టాల సవరణ, ఏపీ మోటారు వాహనాల పన్నులు, ఎస్సీ వర్గీకరణ సహా ది ఇండియా ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లీగల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఆఫ్‌ ది బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ట్రస్ట్‌ ఎట్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆర్డినెన్స్‌-2025 స్థానంలో బిల్లులు ఉన్నాయి.

ఈ క్రమంలోనే ఇవాళ మధ్యాహ్నం అసెంబ్లీలోని సమావేశ మందిరంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ భేటీ జరగనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande