అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు.. ఏసీపి మాధవి
హుజురాబాద్, 18 సెప్టెంబర్ (హి.స.) జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో హుజురాబాద్ ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో కారడన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో అక్రమంగా ఇసుక లోడ్ చేసిన 16 ట్రాక్టర్లను, సరైన పత్రాలు లేని 14 ట్రాక్టర్లను సీజ్ చేసినట్టు పేర్క
హుజురాబాద్ ఏసిపి


హుజురాబాద్, 18 సెప్టెంబర్ (హి.స.)

జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో హుజురాబాద్ ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో కారడన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో అక్రమంగా ఇసుక లోడ్ చేసిన 16 ట్రాక్టర్లను, సరైన పత్రాలు లేని 14 ట్రాక్టర్లను సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గ్రామాలలో ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే సమాచారం అందించాలని, అక్రమంగా ఇసుక తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీజి సిబ్బంది, ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్సైలు మిగతా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande