రేణిగుంట ఇండస్ట్రీయల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం.. ఏకంగా రూ.80 కోట్ల ఆస్తి నష్టం
రేణిగుంట, 18 సెప్టెంబర్ (హి.స.)రెండు తెలుగు రాష్ట్రాలను అగ్ని ప్రమాదాలు వెంటడుతున్నాయి. అధికారులు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా సరే.. ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోని తిరుపతి (Tirupati) జిల్లా రేణిగుంట ఇండస్ట్రియల్ ఏరియా (Renigunta I
రేణిగుంట ఇండస్ట్రీయల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం.. ఏకంగా రూ.80 కోట్ల ఆస్తి నష్టం


రేణిగుంట, 18 సెప్టెంబర్ (హి.స.)రెండు తెలుగు రాష్ట్రాలను అగ్ని ప్రమాదాలు వెంటడుతున్నాయి. అధికారులు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా సరే.. ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోని తిరుపతి (Tirupati) జిల్లా రేణిగుంట ఇండస్ట్రియల్ ఏరియా (Renigunta Industrial Area)లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సెల్‌ఫోన్ పవర్ బ్యాంక్‌లు తయారుచేసే మునోత్ గ్రూప్ లిథియం సెల్ యూనిట్‌ (Munoth Group Lithium Cell Unit)లో షాట్ సర్క్యూట్ కారణంగా భారీ విస్పోటనం సంభవించింది. దీంతో విలువైన బ్యాటరీలు, యంత్రాలు, ముడి పదార్థాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాద సమయంలో సిబ్బంది ఎవరూ విధుల్లో లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.

ఈ ప్రమాదంలో సుమారు రూ.70 నుంచి 80 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని కంపెనీ ప్రతినిధులు మీడియాకు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది కలిసి మంటలను ఆర్పివేసి పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, స్పాట్‌లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. దట్టమైన పొగతో సమీపంలో ఉన్న ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande