హైదరాబాద్, 17 సెప్టెంబర్ (హి.స.)
విద్యా విధానంలో సమూల మార్పులు, ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దేశ విద్య విధానాన్ని మార్చేలా తెలంగాణ కొత్త విద్యా విధానం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ నూతన విద్యా విధానంపై ఇవాళ సెక్రటేరియట్ లో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయికి మన విద్యావిధానం సరితూగడం లేదని, ప్రతి యేటా 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులవుతుంటే వారిలో 15 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారన్నారు. విద్యాశాఖకు 21 వేల కోట్లు కేటాయిస్తే అందులో 98 శాతం జీతాలకే ఖర్చు అవుతుందని చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..