తెలంగాణ, కామారెడ్డి. 17 సెప్టెంబర్ (హి.స.)
కాంగ్రెస్ ప్రవేశపెడుతున్న సంక్షేమ
పథకాలను చూసి అందరూ కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. పార్టీ
కార్యక్రమాలకు ఆకర్షితులై జుక్కల్ నియోజకవర్గంలోని ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన ద్వారా ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్నారని, వారి నాయకత్వాన్ని బలపరిచేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని కొత్తగా చేరిన వారు పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు