తెలంగాణ, ఆసిఫాబాద్. 17 సెప్టెంబర్ (హి.స.)
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా
పాలన కొనసాగుతోందని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ బండ ప్రకాష్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇది ప్రజా ప్రభుత్వమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తొందని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అన్ని హామీలను అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అంతకు ముందు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు