ఉద్యోగులు తమ గౌరవాన్ని కాపాడుకోవాలి : మేడ్చల్ కలెక్టర్ మను చౌదరి
తెలంగాణ, మేడ్చల్. 17 సెప్టెంబర్ (హి.స.) ప్రభుత్వ ఉద్యోగులు తమ విధి నిర్వహాణలో ప్రజలకు తమ వంతు సేవ అందిస్తూనే, తమ గౌరవాన్ని కాపాడుకోవాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు. బుధవారం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టరేట్ లో తెలంగ
మేడ్చల్ కలెక్టర్


తెలంగాణ, మేడ్చల్. 17 సెప్టెంబర్ (హి.స.)

ప్రభుత్వ ఉద్యోగులు తమ విధి

నిర్వహాణలో ప్రజలకు తమ వంతు సేవ అందిస్తూనే, తమ గౌరవాన్ని కాపాడుకోవాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు. బుధవారం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ మను చౌదరి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగలు తమ విధి నిర్వహణలో భాగంగా ప్రజలకు తాము చేయగలిగినంత సేవలు అందించాలని కలెక్టరు సూచించారు. నీతి నిజాయితీగా తమ విధులు నిర్వహిస్తూ తమ గౌరవాన్ని కాపాడుకోవాలని తెలిపారు. అనంతరం తెలంగాణ గీతానికి గౌరవ వందనం చేశారు. ముందుగా అతిథులు పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ..

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande