హైదరాబాద్, 17 సెప్టెంబర్ (హి.స.)
మావోయిస్టులు తుపాకీ వదిలే శాంతి
చర్చలకు వస్తామనడాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. టెర్రరిస్టులు వేరు, నక్సలైట్లు వేరు.. ప్రధాని మోడీ నక్సలైట్లపై చేసిన వ్యాఖ్యలు దుర్మార్గం అన్నారు. నక్సలైట్ల పేరుతో గిరిజనులను చంపడాన్ని వ్యతిరేకిస్తున్నాం.. బస్తర్ అడవులను ఖాళీ చేయించి విలువైన ఖనిజాలు పెత్తందార్లకు ఇవ్వాలని కేంద్రం ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. నక్సలైట్లను చంపితే ఫ్యాక్షనిస్టులకు ప్రభుత్వానికి తేడా ఏముంది అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నక్సలైట్లతో చర్చలు జరపాలి అని డిమాండ్ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు