హైదరాబాద్, 17 సెప్టెంబర్ (హి.స.)
ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని మొదటి నుంచి సీపీఎం పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. నిన్న నక్సలైట్ల పేరుతో బయటికి వచ్చిన లేఖ నిజమా...?కాదా అన్నది పక్కన పెడితే సమస్యకు పరిష్కారం చర్చల ద్వారానే అవుతుందని ఆయన పేర్కొన్నారు.
సీపీఎం ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో వీర తెలంగాణ రైతాంగ పోరాట బహిరంగ సభ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ఆపేసి నక్సలైట్లతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17న ఉత్సవాలు జరిపే అర్హత కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు లేదని ఆయన మండిపడ్డారు.
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర కీలకమన్నారాయన. తెలంగాణ సాయుధ పోరాటంలో అసలు బీజేపీ పార్టీ లేనేలేదన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు