ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారత్.. రాజ్ నాథ్ సింగ్
హైదరాబాద్, 17 సెప్టెంబర్ (హి.స.) భారత్ అంటే సాదాసీదా దేశం కాదని, ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంటున్నామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. నిజాంపాలనలో రజాకార్లు అనేక దారుణాలు చేశారని, పటేల్ సమర్దత వల్లనే హైదరాబాద్ రాజ్యం భారత్
రాజ్ నాథ్


హైదరాబాద్, 17 సెప్టెంబర్ (హి.స.)

భారత్ అంటే సాదాసీదా దేశం కాదని, ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంటున్నామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. నిజాంపాలనలో రజాకార్లు అనేక దారుణాలు చేశారని, పటేల్ సమర్దత వల్లనే హైదరాబాద్ రాజ్యం భారత్ లో విలీనమైందన్నారు. ఆపరేషన్ పోలో దేశ చరిత్రలో మహత్తర ఘట్టమని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో రాజ్ నాథ్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సైనిక అమరవీరుల స్థూపానికి, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఆయన నివాళులు అర్పించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ రాజకార్ల దారుణాలను సహించలేక ప్రజలు తిరగబడ్డారని, పటేల్ సమర్ధత వల్ల హైదరాబాద్ రాజ్యం భారత్ లో విలీనమైనట్లు తెలిపారు. పటేల్ కలలు గన్న దేశాన్ని నిర్మించేందుకు ప్రధాని నరేంద్ర మోడి కృషి చేస్తున్నారని చెప్పారు.

దేశాన్ని ఆగ్రస్థానంలో నిలిపేందుకు ప్రధాని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. జాతీయ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను తిప్పికొట్టాలని రాజ్ నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధర్మ మార్గంలోనే నడుస్తామని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370ని తొలగించి జమ్మూ కశ్మీర్ ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మనలో ఎన్ని విబేధాలున్నా దేశం విషయంలో అందరిదీ ఒకటే మాటగా ఉండాలన్నారు. దేశ రక్షణ, భద్రత విషయంలో ప్రజలమంతా ఏకతాటిపైకి రావాలని కోరారు. ఆపరేషన్ సిందూర్ లో మన సైనికులు సత్తా చాటారన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande