ప్రధాని పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీ సీఎం రక్తదానం
న్యూఢిల్లీ, 17 సెప్టెంబర్ (హి.స.) భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా ''సేవా సంకల్ప్ వాక్'' (''Seva Sankalp Walk'') నిర్వహించారు. ఈ క్రమంలోనే ఇండియా గేట్ వద్ద జరిగిన ''సేవా సంకల్ప్ వాక్''లో పాల్గొన్న ఢిల్లీ సీఎం రే
ఢిల్లీ సీఎం


న్యూఢిల్లీ, 17 సెప్టెంబర్ (హి.స.)

భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా 'సేవా సంకల్ప్ వాక్' ('Seva Sankalp Walk') నిర్వహించారు. ఈ క్రమంలోనే ఇండియా గేట్ వద్ద జరిగిన 'సేవా సంకల్ప్ వాక్'లో పాల్గొన్న ఢిల్లీ సీఎం రేఖ గుప్తా (Delhi CM Rekha Gupta) రక్తదానం (రక్తదానం) చేశారు. అలాగే మంజీందర్ సింగ్ సిర్సా, వీరేంద్ర సన్దేవా, బన్సూరి స్వరాజ్ సహా అనేక మంది మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఇతర భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రధానమంత్రిని గౌరవించేందుకు నిర్వహించిన వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీ ప్రజలకు 75 కొత్త పథకాలను అందిస్తామని సీఎం రేఖ గుప్తా తెలిపారు. సేవా పఖ్వాడా (Seva Pakwada) కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం ప్రారంభించగా ఢిల్లీ సీఎం రేఖ గుప్తా మొదట రక్త దానం చేశారు. అనంతరం ఇతర మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మన ప్రతి రక్తపు బొట్టు దేశం కోసమే అనేది ఢిల్లీ ప్రభుత్వ సంకల్పం. 15 రోజుల సేవా పఖ్వాడ సందర్భంగా, ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీ ప్రజలకు 75 కొత్త పథకాలను అందిస్తాం అని ఆమె చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande