తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డా.. పోరాటాల గడ్డ : కేటీఆర్
హైదరాబాద్, 17 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డా.. పోరాటాల గడ్డ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఎదురిద్దాం. మళ్లీ కేసీఆర్ నాయకత్వ
కేటీఆర్


హైదరాబాద్, 17 సెప్టెంబర్ (హి.స.)

తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డా.. పోరాటాల గడ్డ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఎదురిద్దాం. మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో తిరిగి తెలంగాణను సంక్షేమ బాటలో తీసుకెళ్లామని కేటీఆర్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కొందరు విమోచనం అని, మరికొంత మంది విలీనం అని, ఇంకొంత మంది విద్రోహమని రకరకాలుగా అనవచ్చు గాక, కానీ తెలంగాణ సాయుధ పోరాటంలో ఆనాడు లక్షలాది మంది పాల్గొని వేలాది మంది అసువులు భాసారు. ఆనాటి రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి మనకు స్వేచ్ఛా వాయువులు వచ్చాయంటే ఆనాటి అమరవీరుల త్యాగాలు మనందరికి ఆదర్శం. వారందరికి బీఆర్ఎస్ తరపున, కేసీఆర్, ప్రతి గులాబీ సైనికుడి తరపున వారి అమరత్వానికి శిరసు వంచి వినమ్రంగా నివాళులర్పిస్తున్నాం అని పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande