హైదరాబాద్, 17 సెప్టెంబర్ (హి.స.)
అస్సాం ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అస్సాం అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ పై విడుదల చేసిన వీడియోపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ పాలన లేకపోతే అస్సాం ముస్లింలు అధికంగా ఉండే రాష్ట్రంగా మారిపోతుందని ఈ వీడియోలో చూపించగా.. దీనిపై అసద్ స్పందిస్తూ.. ఇది కేవలం ఓట్ల కోసం చేస్తున్న భయపెట్టే ప్రచారం మాత్రమే కాదని బీజేపీ అసలైన హిందూత్వ భావజాలం ఇదేనని ఆయన అన్నారు.
“భారతదేశంలో ముస్లింలు ఉండడమే వారికి సమస్య. ముస్లిం-ముక్త్ భారత్ వారి కల. ఈ నిరంతర విమర్శలు, ఏడుపు తప్ప దేశం కోసం వారికి ఎటువంటి అభివృద్ధి లేదు అని ఒవైసీ పేర్కొన్నారు. ఈ వీడియో సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉందని, ఇలాంటి చర్యలను ఖండించాలని ఒవైసీ పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..