ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ: మంత్రి దామోదర రాజనర్సింహ
తెలంగాణ, సంగారెడ్డి. 17 సెప్టెంబర్ (హి.స.) రాచరిక వ్యవస్థ నుంచి ప్రజా పాలన వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జోహార్లు తెలిపారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ కార
మంత్రి దామోదర


తెలంగాణ, సంగారెడ్డి. 17 సెప్టెంబర్ (హి.స.)

రాచరిక వ్యవస్థ నుంచి ప్రజా పాలన

వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జోహార్లు తెలిపారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అమరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. నేడు ఈ స్వేచ్ఛ స్వాతంత్య్ర ప్రజాస్వామ్యం మన సొంతం కావడానికి ఎంతో మంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు. ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది. అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలని భారత సైన్యాన్ని రంగంలోకి దింపడంతో అప్పటి నిజాం రాజు భారత యూనియన్ లో విలీనానికి అంగీకరించారనీ తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande