తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన.. మంత్రి పొన్నం.
తెలంగాణ, సిద్దిపేట. 17 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన సాగిస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో జాతీయ జెండా మం
మంత్రి పొన్నం


తెలంగాణ, సిద్దిపేట. 17 సెప్టెంబర్ (హి.స.)

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన సాగిస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో జాతీయ జెండా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎగరవేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ సాధన కోసం సకల జనులు పోరాడారని గుర్తు చేశారు. ప్రజల ఆశీర్వాదంతో 2023 డిసెంబర్ 7న ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. ప్రజా ప్రభుత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 2 వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ 10 లక్షలకు పెంపు, సన్న వడ్లకు 5 వందల బోనస్, రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ, 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డుల పంపిణీ తదితర కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసినట్లు స్పష్టం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande