తెలంగాణ, రంగారెడ్డి. 17 సెప్టెంబర్ (హి.స.)
త్రిబుల్ ఆర్ రోడ్డు మాకు వద్దంటూ
నూతన అలైన్మెంట్ ను మార్చాలని కోరుతూ బుధవారం మాడ్గుల మండలం అన్నె బోయినపల్లి గేటు వద్ద సాగర్ హైవేను దిగ్బందించేందుకు రైతులు, అఖిలపక్ష నాయకులు యత్నించగా ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు ఆధ్వర్యంలో భారీగా పోలీసులను మోహరించి ర్యాలీగా వస్తున్న రైతులను, అఖిలపక్ష నాయకులను. దీంతో రైతులు ఒక్కసారిగా ముఖ్యమంత్రి డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ మా భూములు లాక్కోవద్దంటూ త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చడం వల్ల మండల రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు రైతులకు తోపులాట జరిగింది. పోలీసుల భారీ గేట్లను దాటి సాగర్ హైవే రోడ్డుపై రైతులు బైఠాయించారు. దీంతో హైవేపై అరగంట పాటు వాహనాలకు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ను మార్చి రైతుల నోట్లో మట్టి కొట్టిందని అన్నారు. కాగా ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు స్టేషన్ కు తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు