అమరావతి, 17 సెప్టెంబర్ (హి.స.)
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు)ను తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు కలిశారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను సీఎంకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా వేదపండితులు చంద్రబాబుకు వేదాశీర్వచనం చేశారు. బ్రహ్మోత్సవాలకు తిరుమలలో చేపడుతున్న ఏర్పాట్లపై బీఆర్ నాయుడుతో సీఎం మాట్లాడారు. తితిదే తరఫు చేస్తున్న ఏర్పాట్ల వివరాలను తితిదే ఛైర్మన్ వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ