హైదరాబాద్, 17 సెప్టెంబర్ (హి.స.)
తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పేరు
అనౌన్స్ చేశారు. 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ' పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. ఇవాళ బంజారాహిల్స్ లోని తాజ్ క్రిష్ణా హోటల్ లో జరిగిన కార్యక్రమంలో పార్టీ పేరుతో పాటు పార్టీ జెండాను ఆవిష్కరించారు. పైన ఎరుపు, కింద ఆకు పచ్చు రంగులతో జెండాను రూపొందించారు. మధ్యలో కార్మిక చక్రం, దానిలో నుంచి పిడికిలి బిగించిన మనిషి చేయి, దాని చుట్టు రెండు ఆలీవ్ ఆకులను ఏర్పాటు చేశారు. జెండా పై 'ఆత్మగౌరవం, అధికారం, వాటా' అని రాసి ఉంచారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..