తెలంగాణ అసెంబ్లీ, మండలిలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండా ఆవిష్కరించిన స్పీకర్
హైదరాబాద్, 17 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ వద్ద వేడుకలు జరిగాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్, చైర్మన్ గుత్తా సుఖేందర్ అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ జాతీయ జ
అసెంబ్లీ


హైదరాబాద్, 17 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ వద్ద వేడుకలు జరిగాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్, చైర్మన్ గుత్తా సుఖేందర్ అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ జాతీయ జెండా ఎగురవేశారు. మరోవైపు శాసన మండలిలోనూ ప్రజాపాలన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ జాతీయ జెండా ఆవిష్కరించి.. రాష్ట్ర ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

రాచరిక పాలన నుంచి విముక్తి పొంది తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన ఆరంభమైన రోజు నేడు. సువిశాల భారతావనిలో తెలంగాణ అంతర్భాగమైన రోజును పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు. అని తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్ లో పోస్టు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande