కాకినాడ.జిల్లాలో.బావిలో రెండు. మృతదేహాలు లభ్యం
అమరావతి, 17 సెప్టెంబర్ (హి.స.) పిఠాపురం: కాకినాడ జిల్లాలో బావిలో రెండు మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేపింది. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో బావిలో మృతదేహాలను స్థానికులు గుర్తించారు. మృతులను అదే గ్రామానికి చెందిన తోలాటి సూరిబాబు, రంపం శ్రీనుగా నిర్ధరిం
కాకినాడ.జిల్లాలో.బావిలో రెండు. మృతదేహాలు లభ్యం


అమరావతి, 17 సెప్టెంబర్ (హి.స.)

పిఠాపురం: కాకినాడ జిల్లాలో బావిలో రెండు మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేపింది. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో బావిలో మృతదేహాలను స్థానికులు గుర్తించారు. మృతులను అదే గ్రామానికి చెందిన తోలాటి సూరిబాబు, రంపం శ్రీనుగా నిర్ధరించారు. ఎవరైనా హత్య చేసి బావిలో పడేశారా? ఆత్మహత్యా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande