E20పై హర్దీప్‌ సింగ్‌ పురి
న్యూఢిల్లీ,17,సెప్టెంబర్ (హి.స.): 20శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ (ethanol-blended petrol (E20)) సురక్షితం కాదంటూ గత కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. బయో ఇంధనాల వల్ల ఆటోమొబైల్ ఇంజిన్లు దెబ్బతింటాయని పలువురు
E20పై హర్దీప్‌ సింగ్‌ పురి


న్యూఢిల్లీ,17,సెప్టెంబర్ (హి.స.): 20శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ (ethanol-blended petrol (E20)) సురక్షితం కాదంటూ గత కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. బయో ఇంధనాల వల్ల ఆటోమొబైల్ ఇంజిన్లు దెబ్బతింటాయని పలువురు చేస్తున్న ప్రచారాలను కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి (Hardeep Puri) కొట్టిపారేశారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ కలపడం వల్ల వాహనాల మైలేజీ తగ్గుతోందనేది చెత్త వాదన అన్నారు. ఈ20(E20) ఇంధనం పర్యావరణపరంగా ఉపయోగించడానికి సురక్షితమని పేర్కొన్నారు. అయితే దీర్ఘకాలంలో పాత వాహనాల్లో గ్యాస్కెట్లు, ఇంధన రబ్బరు గొట్టాలు, పైపులను మార్చాల్సి రావచ్చని.. అది సాధారణమైన విషయమేనని పేర్కొన్నారు.

పలువురు ఉద్దేశపూర్వకంగానే ఇథనాల్‌తో సమస్యలు వచ్చే అవకాశం ఉందని ప్రజల్లో తప్పుడు భయాలను సృష్టిస్తున్నారని హర్దీప్‌ సింగ్‌ పురి పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande