దేశం కోసం చాలా సాధించారు.. ఇజ్రాయెల్ ప్రధాని స్పెషల్ వీడియో విడుదల
ముంబయి,17, సెప్టెంబర్ (హి.స.) ప్రపంచ వ్యాప్తంగా ప్రధాని మోడీకి బర్త్‌డే విషెస్‌లు వెల్లువెత్తుతున్నాయి.ఇక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా వీడియోలో మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. భారతదేశం కోసం చాలా సాధించారంటూ నెతన్యాహు కొనియాడారు. భారతదేశ
ఇజ్రాయెల్ ప్రధాని స్పెషల్ వీడియో


ముంబయి,17, సెప్టెంబర్ (హి.స.) ప్రపంచ వ్యాప్తంగా ప్రధాని మోడీకి బర్త్‌డే విషెస్‌లు వెల్లువెత్తుతున్నాయి.ఇక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా వీడియోలో మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. భారతదేశం కోసం చాలా సాధించారంటూ నెతన్యాహు కొనియాడారు. భారతదేశం-ఇజ్రాయెల్ మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయన్నారు. రెండు దేశాలు మంచి విజయాలను సాధించాయని నెతన్యాహు ప్రశ్నించారు.

తాజాగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ.. ప్రధాని మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. వీడియోలో మోడీని ‘‘అవతార పురుషుడు’’గా అభివర్ణించారు. భారతదేశం 100 ఏళ్లు నిండేదాకా మోడీ భారతదేశానికి సేవ చేయడం కొనసాగించాలని ఆకాంక్షించారు. ఇది తన ప్రగాఢ కోరిక అని ముఖేష్ అంబానీ తెలిపారు.

ప్రధాని మోడీ భారతదేశాన్ని ప్రపంచ సూపర్ పవర్‌గా ఎదిగేందుకు ఎంతో కృషి చేశారన్నారు. దశాబ్దాల అంకితభావం, పరివర్తనాత్మక నాయకత్వం, దార్శనికతే కారణం అని ముఖేష్ ప్రశంసించారు. ఈరోజు 1.45 బిలియన్ భారతీయులకు ఇదొక వేడుక అని చెప్పారు. భారతీయులందరికీ ఈరోజు పండుగ రోజే అన్నారు. ఎందుకంటే మన మాతృభూమిని గొప్ప దేశంగా మార్చడానికి సర్వశక్తిమంతుడైన దేవుడు మోడీని అవతార పురుషుడిగా పంపించారని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande