అక్టోబర్‌లో భారత్‌కు రానున్న యూకే ప్రధాని కీర్ స్టార్మర్!
న్యూఢిల్లీ,17,సెప్టెంబర్ (హి.స.) బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధికారికంగా తేదీలు ప్రకటించనప్పటికీ అక్టోబర్ చివరి నాటికి భారత్‌లో పర్యటించే ఛాన్సుందని తెలుస్తోంది. ఇక ముంబైలో జరిగే ఫిన్‌టె
ప్రధాని కీర్ స్టార్మర్!


న్యూఢిల్లీ,17,సెప్టెంబర్ (హి.స.) బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధికారికంగా తేదీలు ప్రకటించనప్పటికీ అక్టోబర్ చివరి నాటికి భారత్‌లో పర్యటించే ఛాన్సుందని తెలుస్తోంది. ఇక ముంబైలో జరిగే ఫిన్‌టెక్ సమావేశంలో కూడా కీర్ స్టార్మర్ పాల్గొంటారని సమాచారం.

ప్రధాని మోడీ ఇటీవల లండన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఫిన్‌టెక్‌పై ఒప్పందాలు జరిగాయి. ఈ సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు కీర్ స్టార్మర్ అక్టోబర్‌లో భారత్‌కు రావొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా వేసవిలోనే ఈ పర్యటన జరగాల్సి ఉండగా అప్పుడు సాధ్యం కాలేదు. దీంతో అక్టోబర్ చివరి నాటికి పర్యటన ఉండొచ్చని వర్గాలు పేర్కొన్నాయి.

ఫిన్‌టెక్ సమావేశంలో భాగంగా కీర్ స్టార్మర్ ముంబైలోనే ఉండొచ్చని వర్గాలు భావిస్తున్నాయి. గత సంవత్సరంలో ప్రధాని మోడీ-కీర్ స్టార్మర్ అనేక సార్లు కలిశారు. ఇక గత జూలైలో కూడా మోడీ లండన్‌లో పర్యటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande