అమరావతి, 18 సెప్టెంబర్ (హి.స.)
, ఉరవకొండ: ఆ యువకుడిది పేద కుటుంబం. తల్లిదండ్రులు చేనేత కార్మికులు. అందులోనూ తండ్రి పక్షవాతంతో మంచం పట్టాడు. తల్లి నేత కార్మికురాలిగా పనిచేస్తూ అందించిన సహకారంతో ఆయన డీఎస్సీ కోసం సాధన చేశాడు. 2018లో రాసిన పరీక్షలో ఒక్క మార్కుతో ఓటమిని చవిచూసిన అతను అదే కసితో చదివి తాజా డీఎస్సీలో ఐదు ఉద్యోగాలు కైవసం చేసుకోవడం గమనార్హం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ