అమరావతి, 18 సెప్టెంబర్ (హి.స.)
అమరావతి: గ్రూప్-1 పరీక్షల విధానంలో మార్పులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇప్పటి వరకు స్క్రీనింగ్ (ప్రిలిమినరీ) పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తుండగా, ఇకపై ఒక్క పేపర్‌గానే నిర్వహించాలని నిర్ణయించింది. మెయిన్స్‌లో అర్హత పరీక్షలుగా ఉన్న తెలుగు, ఆంగ్ల భాష సబ్జెక్టు రెండు పేపర్లను కూడా ఒక్క పేపర్‌గానే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. అక్కడ ఆమోదం లభిస్తే కొత్తగా ఇచ్చే నోటిఫికేషన్ల నుంచి ఇవి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ